వాస్తవానికి ఎలుగుబంటి బోను తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించకపోవటంతో నగేష్ దాడికి గురయ్యాడు. తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. ఆ ఎలుగుబంటి అతడిపై తీవ్రంగా దాడి చేసి చివరికి ప్రాణాలు తీసింది. జూలో సందర్శకులు చూస్తుండగానే ఈ ఆకస్మాత్తుగా దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దారుణాన్ని చూసిన సందర్శకులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నగేష్ స్వస్థలం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని టి.బూర్జవలస. గత రెండేళ్లుగా నగేష్ జూలో విధులు నిర్వహిస్తున్నాడని, మృతుని కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించినట్లు క్యూరేటర్ సలారియా తెలిపారు.