ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం జోషీమఠ్ ప్రాంతం రోజురోజుకూ కుంగిపోతోంది. మరికొన్ని రోజులకు ఇది చాలా మేరకు కుంగిపోవచ్చని భూశాస్త్రవేత్తలు, ఇస్రో సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాటిలైట్ ఫోటోలను తాజాగా రిలీజ్ చేసింది. పైగా, ఈ జోషిమఠ్ ఇలా ఎందుకు కుంగిపోతుందో కారణం తెలుసుకునేందుకు ఇప్పటికే పలు రంగాలకు చెందిన నిపుణులు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
గత యేడాది రెండో తేదీన జోషిమఠ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పటి నుంచి అక్కడ నేల కుంగిపోవడం ప్రారంభమైనట్టు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి టౌన్‌లోని నార్సింగ్ ఆలం, ఆర్మీ హెలిపాడ్ వద్ద భూమి వేగంగా కుంగిపోయినట్టు చెబుతున్నారు. పట్టణంలోని 700 బిల్డింగుల్లో పగుళ్లు వచ్చినట్టు పేర్కొంది.