మరో పథకానికి పేరు మార్చిన ఏపీ సర్కారు... ఏంటది?

ఠాగూర్

మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (14:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి పేరు మార్చింది. గత వైకాపా ప్రభుత్వం అమలు చేసిన "శాశ్వత భూ హక్కు - భూ రక్షణ పథకం"  పేరును ఏపీ సరీ సర్వే ప్రాజెక్టుగా మార్చు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలకు తనతో పాటు తన తండ్రి పేర్లను పెట్టుకున్న విషయం తెల్సిందే. ఇపుడు వీటి పేర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మార్చివేస్తుంది. 
 
తాజాగా పేరు మార్చిన ఏపీ రీ సర్వే ప్రాజెక్టు పథకంలో భాగంగా, గ్రామాల్లో భూ వివాదాలు, తగాదాలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంంత తీసుకొచ్చామని గత ప్రభుత్వం పేర్కొంది. ఇందులోభాగంగా, భూములను సమగ్ర రీ సర్వే చేపట్టారు. కానీ, ఈ పథకం ఆచరణలో వచ్చేసరికి భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధితులు శాశ్వత భూ హక్కు - భూ రక్షణ పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ అమలు తీరును అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. తాము అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇపుడు  ఆయన సీఎం కావడంతో ఈ పథకంలో మార్పులు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు