'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు'లోకి కీసర తాహసీల్దార్??

గురువారం, 27 ఆగస్టు 2020 (09:52 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇటీవల కీసర తాహసీల్దారు భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన పేరు నాగరాజు. ఇపుడు ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రెండు స్వచ్ఛంధ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 
 
ఇటీవల ఒక‌ భూప‌ట్టా విష‌యంలో రూ.2 కోట్ల‌కు డీల్ మాట్లాడుకుని రూ.1.10 కోట్లు స్వీక‌రిస్తూ ఇటీవ‌లే త‌హ‌సీల్దార్ ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. ఈయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించాల‌ని అవినీతికి వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న‌ చెందిన రెండు స్వ‌చ్ఛంద సంస్థ‌లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను కోరాయి. 
 
ముఖ్యంగా, ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి 20 మిలియ‌న్ల‌ను లంచం రూపంలో తీసుకుంటూ ప‌ట్టుబ‌డ‌టం ప్ర‌పంచంలోనే ఇదే తొలిసారి అయివుండొచ్చని యూత్ ఫ‌ర్ యాంటీ క‌రప్ష‌న్ (వైఏసీ) అధ్య‌క్షుడు ప‌ల్నాటి రాజేంద‌ర్, వ‌రంగ‌ల్ కేంద్రంగా అవినీతి వ్య‌తిరేక అవ‌గాహ‌న‌ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న జ్వాల సంస్థ అధ్య‌క్షుడు సుంక‌రి ప్ర‌శాంత్ గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డుకు ఆన్‌లైనులో చేసుకున్న ద‌ర‌ఖాస్తులో తెలిపారు.
 
కాగా, ఈ అంశంపై గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్ర‌భుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన త‌మ‌వ‌ద్ద ఇంత‌వ‌ర‌కు ఎలాంటి కేట‌గిరీ లేద‌ని, దీనికోసం ప్ర‌త్యేకంగా కేట‌గిరి ప్రారంభించే విషయాన్ని ప‌రిశీలిస్తామ‌ని సమాధానమిచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు