పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రెండు లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బాలురు 1,09,413 మంది, బాలికలు 82,433 మంది ఉన్నారు. ఫలితాల్లో బాలురు 60 శాతం పైగా ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 68 శాతం ఉత్తీర్ణులయ్యారు.
పరీక్షలకు మొత్తం 1,91,896 మంది పరీక్ష రాస్తే 1,31,233 మంది పరీక్ష ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 46.66 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.