వాడిగా వేడిగా... ఏపీ అసెంబ్లీ సమావేశాలు; టీడీపీ తీర్మానానికి నో!

గురువారం, 18 నవంబరు 2021 (10:15 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇటీవ‌ల జ‌రిగిన రాజ‌కీయ దుమారాల నేప‌థ్యంలో, స్థానిక ఎన్నిక‌ల హీట్ త‌ర్వాత జ‌ర‌గుతున్న అసెంబ్లీ స‌మావేశాలివి. ప్రారంభం నుంచే స‌మావేశాలు వాడిగా వేడిగా మొద‌ల‌య్యాయి.
 
 
ముందుగా, ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్‌, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాల్లో తొలుత బద్వేలు ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచిన డాక్టర్‌ దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దివంగతులైన 10 మంది మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది.
 
 
అయితే, పొలిటిక‌ల్ హీట్ ఎక్కించ‌డానికి టీడీపీ చేసిన తొలి ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌  తమ్మినేని సీతారాం తిరస్కరించారు.  దీనితో టీడీపీ స‌భ్యులు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు