తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అశోక్ బాబు చిక్కుల్లోపడ్డారు. ఈయన బీకాం డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొంటూ ఆయనపై సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దీంతో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు అశోక్ బాబుపై ఐపీసీ 477, 420, 465 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన బీకాం డిగ్రీ పూర్తిచేయకుండానే నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చారని, సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం అందించారని అభియోగాలు నమోదు చేశారు.
డిగ్రీ చదివినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. పైగా, ఈయన సర్వీసు రికార్డులను కూడా తారుమారు చేశారన్న ఆరోపణలపై కూడా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.