జగన్ మోహన్ రెడ్డికి సెంట్రల్ జైలు పిచ్చి... ఎక్కడికెళుతున్నారు మీరు...? చంద్రబాబు ప్రశ్న

బుధవారం, 1 మార్చి 2017 (16:40 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. బస్సు ప్రమాదానికి అధికారులు ఎలా కారకులవుతారంటూ ప్రశ్నించారు. జిల్లా కలెక్టరును పట్టుకుని నిన్ను కూడా సెంట్రల్ జైల్లో పెట్టిస్తా అని జగన్ వ్యాఖ్యానించడాన్ని చూస్తే... ఆయన మానసిక పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందన్నారు. 
 
ఎప్పుడు చూసినా జగన్ మోహన్ రెడ్డికి జైళ్లే గుర్తుకు వస్తాయన్నారు. ఆయన జైలులో ఎప్పుడు పడతారో కూడా చెప్పలేని పరిస్థితి వుందన్నారు. కలెక్టరుతో అనుచితంగా ప్రవర్తిస్తే అక్కడికక్కడే కలెక్టరు తన అధికారాలతో అరెస్టు చేసేయవచ్చని తెలిపారు. అంతటి అధికారం వున్న కలెక్టరును పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసమా... ఎక్కడికి వెళుతున్నారు మీరు.. అంటూ ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి