అడ్డుపడిన పొగమంచు... సీఎం జగన్ కడప పర్యటన రద్దు

మంగళవారం, 6 డిశెంబరు 2022 (16:08 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడప పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మంగళవారం జిల్లాలో పర్యటించాల్సివుంది. అయితే, కడప ఎయిర్ పోర్టు వద్ద దట్టమైన పొగమంచు ఉండటంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన తన పర్యటను రద్దు చేసుకున్నారు. ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఎంతో సేవు వేచి చూసినప్పటికీ వాతావరణం ఏమాత్రం అనుకూలించక పోవడంతో సీఎం జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
కాగా, కడప జిల్లా పర్యటనలో సీఎం జగన్ మంగళవారం కడపలోని అమీన్ పీర్ ఉత్సవాల్లో పాల్గొనాల్సి వుంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు కూడా హాజరుకావాల్సివుంది. అయితే, కడప ఎయిర్ పోర్టు వద్ద దట్టమైన పొగమంచు ఎంతకీ తొలగిపోకపోవడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు