ఒక్కొక్కరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా? సీఎం జగన్ ప్రశ్న

గురువారం, 20 అక్టోబరు 2022 (13:37 IST)
వైకాపా నేతలను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కౌంటరిచ్చారు. ఆయన బుధవారం మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతానికి, ఎవరికీ అన్యాయం జరగకుండా అభివృద్ధి చేసుకుందామని మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేసినట్టు చెప్పారు. 
 
అయితే, కొందరు నేతలు మూడు రాజధానులు కాదు.. మూడు పెళ్ళిళ్లతో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారని పరోక్షంగా జనసేన చీఫ్ పవన్‌పై మాటలు స్పందించారు. ఏకంగా టీవీల ముందుకు వచ్చి మూడు వివాహాలు చేసుకోమని చెపుతున్నారన్నారు. 
 
చెప్పులు చూపిస్తూ, దారుణమైన భాషలో తిడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్లా మన నాయకులని విరక్తి కలుగుతున్నట్టు జగన్ చెప్పారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లారని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కరు మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటుంటే మన అక్కా చెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్ళి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి ఎంతో కొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు