ఒక ప్రాంతంలో హైకోర్టు - మరో చోట రాజధాని : తులసి రెడ్డి

గురువారం, 29 ఆగస్టు 2019 (12:30 IST)
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఒక ప్రాంతంలో హైకోర్టు, మరో ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని 1937 లోనే ఒప్పందం జరిగిందని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నవ్యాంధ్రలో రాజధాని అమరవతిలోనే ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. 
 
అమరావతికి సాక్ష్యాత్తూ ప్రధాని శంకుస్థాపన చేశారు. నిధులు వెచ్చించారు. ఇప్పటికే చాలావరకు భవనాలు పూర్తయ్యాయి. అవి తాత్కాలికమో, శాశ్వతమో ఏదైనా నిర్మాణాలు జరిగాయి. ఆ భవనాల్లోనే ముఖ్యమంత్రి కూర్చుని పరిపాలన చేస్తున్నారు. ఎన్జీవో, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాల్ 4 ఉద్యోగుల, నివాసాలు, న్యాయమూర్తుల నివాసాలు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే అన్ని 80 శాతం పూర్తయ్యాయి. 
 
ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్న భవనాలు రాజధానికి సరిపోతాయి. ఇప్పుడు ప్రభుత్వం కాస్త వెచ్చిస్తే మిగతావి పూర్తైపోతాయి. ఇటువంటి సందర్భంలో వేరే ఆలోచన ఎందుకు? ఇప్పుడు ఉన్న చోటే రాజధానిని పూర్తి చేయాలి. బొత్స చెప్పినట్టు నిర్మాణాలకు అధిక వ్యయం అన్న మాటలో వాస్తవం లేదు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితి వలన పెట్టుబడిదారులు వెనక్కి పోతున్నారు. 
 
ఆదాయం ఇప్పటికే మందగించింది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి. అధికార వికేంద్రీకరణలో భాగంగా, శ్రీబాగ్ఒడంబడిక ప్రకారం హై కోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలి. అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలి. జగన్ రాజకీయ కక్ష పక్కన పెట్టి ఆ దిశగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు