ఆ సినీ నటుడికి రాజకీయమే తెలియదు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఆదివారం, 26 జూన్ 2022 (09:41 IST)
సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి విమర్శలు చేశారు. సినిమా నటుడు కల్యాణీ (పవన్‌ కల్యాణ్‌నుద్దేశించి)కి రాజకీయమే తెలియదు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని అల్లాడుతున్నారు. ఆయనకు దమ్మూ ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీచేయాలి. ఒకటి రెండు సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు. 
 
తిరుపతిలో శనివారం జరిగిన నియోజకవర్గ ప్లీనరీలో నారాయణస్వామి మాట్లాడుతూ, తమ నాయకుడు జగన్మోహన్‌ రెడ్డిపై కుట్రలు చేసి జైలుకు పంపేందుకు కారణమైన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నేడు రాజకీయంగా దెబ్బ తిన్నారని గుర్తుచేశారు.  రాష్ట్రంలో సీఎం జగన్ రాజన్న పాలన సాగిస్తూ బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని, ప్రతి పేదవాడూ ఆనందంగా ఉన్నారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు