ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా, కొండప్రాంతాల్లో ఉండే గిరిపుత్రులపై రక్షణపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా, ఆయన ఇటీవలి కాలంలో గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి, డుంబ్రిగూడ గ్రామాలను పవన్ కల్యాణ్ సందర్శించిన సమయంలో అక్కడి వారి బాధలు చూసి పాదరక్షలు పంపించారు. తన తోటలోని ఆర్గానిక్ పండ్లు వారికి పంపిణీ చేసి తన మంచి మనసును చాటుకున్నారు.
తాజాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలైన చిలక మెండంగి, తాడిప్యూట్టి, బెండ మొండింగి, డోయువరా బాగుజోల, సిరివర గ్రామాల్లోని 222 కుటుంబాలకు రగ్గులు పంపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ పంపిన రగ్గులను అందుకున్న గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.