రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ, వాస్తవాలకు ప్రతిరూపంగా వైట్ పేపర్ విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
జాతీయ స్థాయిలో పోలిస్తే ఏపీ స్థూల ఉత్పత్తి చాలా తక్కువగా ఉందనీ, 2004 నుంచి 2009 వరకూ ఏపీ 12 శాతం వృద్ధిలో ఉందని గుర్తుచేశారు. 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రానికి ఆర్థికంగా బ్యాడ్ పీరియడ్,
రాష్ట్రానికి ఉపయోగపడేలా ఎక్కడా ఖర్చు పెట్టలేదని చెప్పారు. అనవసరమైన ఖర్చులు అధికంగా పెరిగిపోయాయనీ, ఎఫ్ఆర్‌బీఎం చట్టం ప్రకారం స్థూల జాతీయ ఉత్పత్తిలో 3 శాతం మాత్రమే అప్పుకు అవకాశం ఉంటే 4.08 శాతం అప్పులు చేశారని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.