హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

దేవీ

మంగళవారం, 26 ఆగస్టు 2025 (18:00 IST)
Tanikella Bharani, Raman, Chandra, Rambabu and team
రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలు. మంగళవారం నాడు మటన్ సూప్ నుంచి హర హర శంకర సాంగ్‌ను ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేశారు.
 
అనంతం తనికెళ్ల భరణి మాట్లాడుతూ .. ‘ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు లేకుండా ‘మటన్ సూప్’చిత్రం పెద్ద విజయం సాధించాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త రక్తం వస్తోంది. నలభై ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓ సినిమా తీయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసు. ఈ మూవీ తీసిన వారి, చూసిన వారి జీవితాలు మారిపోవాలి. ‘హర హర శంకర’ పాటలో సమాజంలో జరుగుతున్న ఘోరాల్ని చూపించారు. ‘మటన్ సూప్’ టీం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. ఈ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.
 
రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ,  చిత్రంలోని ‘హర హర శంకర’ పాటను రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి గారికి ధన్యవాదాలు. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల గారికి థాంక్స్. త్వరలోనే మా చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లు ఇస్తాం. సెప్టెంబర్‌లో మూవీని విడుదల చేసేదుకు ప్రయత్నిస్తున్నామ’ని అన్నారు.
 
నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ,  తనికెళ్ల భరణి మా పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన రావడంతో మాకు స్వయంగా ఆ శివుడే వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇక్కడే మేం విజయం సాధించినట్టుగా అనిపిస్తోంది’ అని అన్నారు.
 
నిర్మాతలు అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల మాట్లాడుతూ, సినిమాల్లో చూస్తూ పెరిగిన నేను ఈ రోజు ఇలా ఆయన పక్కన నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మా కోసం ఆ శివుడే తరలి వచ్చినట్టుగా అనిపిస్తోంది’ అని అన్నారు.
 
హీరో రమణ్ మాట్లాడుతూ,  ప్రతీ సీన్ జీవితంలో జరిగినట్టుగానే అనిపిస్తుంది. ఈ పాటను వింటుంటూ నాకు కన్నీళ్లు వస్తాయి. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు. నటి సునీత మనోహర్ మాట్లాడుతూ, ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ కానుంది’ అని అన్నారు.
 
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పర్వ‌త‌నేని రాంబాబు, లైన్ ప్రొడ్యూస‌ర్ కొమ్మా రామ కృష్ణ, ఎడిట‌ర్ లోకేష్ క‌డ‌లి, న‌టుడు గోవింద్ రాజ్ నీరుడి త‌దిత‌రులు పాల్గొని తనికెళ్ల భరణి గారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 
నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు