నిమ్మగడ్డ పిటిషన్ వేసిన మరక్షణమే ఎన్నికల సంఘం నిర్వహణ నిధుల కింద రూ.39 లక్షలు విడుదల చేసింది. ఆపై రూ.40 లక్షలకు గానూ రూ.39 లక్షలు విడుదల చేశామని, దీనిపై అదనంగా ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించడం గమనార్హం. ఏదైనా అవసరం ఉంటే ఏపీ ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు.
అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తాము గమనిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం. పైగా, జరుగుతున్న పరిణామాలను తాము గమనిస్తే తప్పేమిటని న్యాయమూర్తి ప్రభుత్వ అడ్వకేట్‌ను సూటింగా ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని, ప్రభుత్వ వైఖరితో హైకోర్టును ఆశ్రయించాల్సిరావడం బాధాకరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.