పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణను ఏదో రూపంలో అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిపట్టుతో ఉంది. అందుకే ఆయనకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలన్న భావిస్తుంది.
ఏపీలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధిపతిగా ఉన్న నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అయితే, ఆయనపై సీఐడీ పోలీసులు మోపిన అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలుకు వెళ్ళకుండానే నారాయణ విడుదలయ్యారు. దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది.