ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్: టిక్కెట్ రేట్లపై తీర్పు

మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:32 IST)
ఏపీ సర్కారుకు హైకోర్టు షాకిచ్చింది. ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. 
 
సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని న్యాయవాదులు తెలిపారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ తరపు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. వెంటనే టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.35ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది.
 
ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావించి కొత్తగా ఆన్ లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఏరియాను బట్టి రేట్లను నిర్ణయిస్తూ.. అన్ని సినిమాలకు.. అంటే చిన్న పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్నింటికీ ఒకే ధరను నిర్ణయిస్తూ.. జీవో 35ను తీసుకొచ్చింది. ఈ జీవోను హైకోర్టు రద్దు చేసింది. 

వెబ్దునియా పై చదవండి