రాజు (హైకోర్టు) లేకుండా న్యాయరాజధాని ఎలా సాధ్యం : హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు

గురువారం, 18 నవంబరు 2021 (11:27 IST)
రాజు లేకుండా అంటే హైకోర్టు లేకుండా కర్నూలులో న్యాయ రాజధాని ఎలా సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని అమరావతి వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో ఆయన పలు ప్రశ్నలతో పాటు సందేహాలను వ్యక్తం చేశారు.
 
'అసలు న్యాయ రాజధాని అంటే ఏమిటి? పాలన వికేంద్రీకరణ చట్టంలో కర్నూలులోనే హైకోర్టు ఉండాలనే స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలను (హెచ్‌ఆర్‌సీ) ఇప్పటికే ఏర్పాటు చేసింది. హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారు.
 
కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికీ పోదు. అలాంటప్పుడు హైకోర్టు లేకుండా కర్నూల్లో న్యాయ రాజధాని ఎలా సాధ్యం? రాజు (హైకోర్టు) లేకుండా రాజధాని ఎలా సాధ్యం? కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పాలన వికేంద్రీకరణ చట్టంలో ఉంది.
 
అలాంటి హామీని చట్టంలో పొందుపరచవచ్చా? ప్రభుత్వ నిర్ణయం కర్నూలు, ఇతర ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం ఉంది. అమరావతి ఏర్పాటు విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయం.. హైకోర్టు ఏర్పాటు విషయంలోనూ వర్తిస్తుందా?’ అని సీజే ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు