కాగా, రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో అగ్రనిర్మాత మైత్రీమూవీస్ నిర్మాత నవీన్ ఎర్నేని గొప్ప స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితి లో వేతనాలు పెంచే అవకాశం లేదు అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఇండస్ట్రీ లో సినిమా లకు రిటర్న్స్ బాగా తగ్గాయి. సినిమాలను చూడడానికి థియేటర్లలో ప్రేక్షకులు రావడంలేదు. సినిమా థియేటర్లలో విడుదలకావాలంటే ఓటీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన దారుణ పరిస్థతి వచ్చింది. OTT. బిజినెస్ లు లేవు. కార్మికల నాయకులు, కార్మికులు ఆలోచించుకోవాలని మైత్రి నవీన్ చెప్పారు.
పెద్ద సినిమా కార్మికులకు పెంపుదల వర్తిస్తుంది
ఇదిలా వుండగా, ఏడాదికి పది సినిమాలు పెద్దవి జరుగుతుంటాయి. రెండేళ్ళు, మూడేళ్ళు ఐదేళ్ళు షూటింగ్ లు జరుగుతుంటాయి. అందులో పనిచేసేవారికి తప్పిని సరి పెంపు దల చేయాల్సి వస్తుందనీ, లేదంటే వారంతా బాలీవుడ్, తమిళనాడు నుంచి అసిస్టెంట్లను తెచ్చుకుంటామని టెక్నీషియన్లు గట్టిగా చెబుతున్నారు. దీనిపై సినీ పెద్దలకు విన్నవించినా వారు చేసింది ఏమీ లేదు. ఇక్కడ పెద్ద మాఫియానే కొనసాగుతుందని... పీపుల్స్ మీడియా అదినేత విశ్వప్రసాద్ తెలియజేస్తున్నారు.
కార్మికుల కోసం పెడరేషన్ ప్రెసిడెంట్ చండీయాగం ?
కార్మికుల శాఖ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ నిన్న ఓ ప్రకటన చేశారు. కార్మికుల కోసం తానొక చండీ యాగం చేస్తున్నాననీ, అది కూడా చిత్రపురి కాలనీలోని పాత కార్యాలయంలో జరుగుతుందని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. చంఢీ యాగం అంటే వ్యక్తిగతం జరుపుకునేది. కానీ ఈయనగారు కార్మికులందరి కోసం అంటూ ప్రకటనలు చేస్తూ కార్మికులను మోసం చేస్తున్నారని చిత్రపురి పోరాట కమిటీ సంఘ నాయకులు విమర్శిస్తున్నారు.
కార్మికులను పావుగా ఉపయోగించుకుంటున్నారా !
ఫెడరేషన్ ఎన్నికలు గత ఆరునెలలుగా జరపలేదు. పైగా ఫిలింఛాంబర్ ఎన్నికలు కూడా జరగాల్సి వుంది. కానీ ఇరు అసోసియేషన్ల కాలపరిమితికి కాలం చెల్లింది. కానీ పాత కమిటీవారే తమ స్వలాభం కోసం తమకు అనుకూలమైన కార్మికులను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.