ఎయిడెడ్ స్కూల్స్‌లు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ ఎలా ఆపుతారు: హైకోర్టు

సోమవారం, 4 అక్టోబరు 2021 (18:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిడెడ్ స్కూళ్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 
 
ఎయిడెడ్ విద్యా సంస్థలు అన్నిటినీ ప్రభుత్వంలోకి విలీనం చేసే ప్రక్రియను వ్యతిరేకిస్తూ పలు కాలేజీల అసోసియేషన్లు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌ కుమార్‌ గోస్వామితో కూడిన ధర్మాసనం విచారించింది. 
 
ఈ సందర్భంగా కీలక ఆదేశాలిచ్చింది. హైకోర్టులో కేసులు ఉన్నంత వరకూ ఎయిడెడ్ స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఆర్‌జేడీలు, డీఈవోలకు ఆదేశాలివ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈనెల 22లోపు సంబంధిత పిటిషన్లు అన్నిటికీ కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. ఈనెల 28 వరకు ఎయిడెడ్ సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు