ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు నోషనల్ సీనియారిటీ కల్పించే విషయంపై గత 2019లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు వెంకటరమణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తక్షణం ఆయనకు సీనియారిటీ కల్పించాలని ఆదేశించింది.
అయితే, కోర్టు ఆదేశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదైంది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన కోర్టు... న్యాయస్థానం అమలులో ఒక యేడాది పాటు జాప్యం కావడానికి డీఈవోనే ప్రధాన కారణమని తేల్చింది.
దీంతో కోర్టుకు ఆయన సారీ చెప్పారు. అయితే, క్షమాపణలు అంగీకరించాలంటే వారం రోజుల పాటు జిల్లాలోని ఏదేని వృద్ధాశ్రమంలోకానీ, అనాథాశ్రమంలోగానీ సామాజికసేవ చేయాలని, వారి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు డీఈవో అంగీకరించారు.