2019 ఎన్నికల్లో చంద్రబాబును కసితీరా బాదేశారు : ఏపీ మంత్రి గుడివాడ

బుధవారం, 4 మే 2022 (17:29 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై అన్ని రకాల వస్తువుల ధరలు, విద్యుత్, నిత్యావసర ధరలు, ఆర్టీసీ చార్జీలను విపరీతంగా పెంచేశారు. దీంతో విపక్షాలు జగన్ ప్రభుత్వంపై బాదుడే బాదుడు పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టలేక వైకాపా నేతలు, మంత్రులు విఫలమవుతున్నారు. తాజాగా చంద్రబాబుతో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. 
 
ఎన్నికలు జరిగిన మూడేళ్లకు చంద్రబాబుకు రాష్ట్రం గుర్తొచ్చిందన్నారు. బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబును ప్రజలు చితికబాదారని గుర్తుచేశారు. 
 
రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో వీడియో తీసిన ఘటనపై విచారణ జరిపిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు