వెర్సటైల్ హీరో ధనుష్ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పా పాండి, రాయన్ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, జాబిలమ్మ నీకు అంత కోపమా వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.