ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఎక్కడా గెలవలేరని స్పష్టం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లిలో ఎక్కడ్నించైనా పోటీ చేయాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. కుప్పంలో పోటీచేసినా చంద్రబాబు ఓడిపోతారని అన్నారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానేమో అని వ్యాఖ్యానించారు.
తాను దళిత వ్యతిరేకినని అంటూ చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు పెద్దిరెడ్డి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని పెద్దిరెడ్డి విమర్శించారు. జడ్జి రామకృష్ణ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శంకర్, శ్రీనివాసుల రెడ్డిపై ఆ పార్టీ కార్యకర్తలే తిరగబడ్డారని చెప్పారు.