తోట త్రిమూర్తులుకు కరోనా పాజిటివ్‌

శనివారం, 7 ఆగస్టు 2021 (11:25 IST)
thota trimurthulu
తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోది. గడిచిన రెండు రోజులుగా నీరసంగా అనిపించడంతో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు తోట త్రిమూర్తులు. 
 
అయితే.. ఈ నివేదికలో అనూహ్యంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం.. ఆయన స్వగ్రామం వెంకటాయపాలెంలో హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. 
 
తనతో సన్నిహితంగా ఉన్న అధికారులు, కార్యకర్తలు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు తోట త్రిమూర్తులు. కాగా.. అటు ఏపీలో రోజు. రోజుకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు