ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో రీ-పోలింగ్ జరగనుంది.
ఇక పరిషత్ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్ జరిగింది. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ దాదాపు 80 శాతం మేర జరిగే పోలింగ్.. ఈసారి కేవలం 60.91శాతంగానే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాల్లో కలిపి 81శాతం పోలింగ్ రికార్డయింది. అప్పటి కంటే ఇప్పుడు ఏకంగా 20 శాతం మంది తక్కువగా ఓట్లేశారు.