మరోవైపు, సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం కోరింది. అయితే.. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. అనంతరం ఈ కేసును మరో ధర్మాసనానికి రమణ బదిలీ చేశారు. కాగా.. కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి చేస్తోందని, అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.
ఇదిలావుండగా, సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగిన సమయంలో జల వివాదాలను సామరస్యంగా తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చేమో, దయచేసి పరిశీలించండి. అవసరమైతే ఇందుకు సుప్రీంకోర్టు కూడా సహకరిస్తుంది.
ఈ విషయంలో అనవసరంగా కోర్టు జోక్యం చేసుకోవాలని భావించడంలేదు. తెలంగాణ ప్రభుత్వ అసంబద్ధ, అన్యాయమైన చర్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులకు భంగం కలుగుతోంది. చట్టబద్ధంగా దక్కాల్సిన జలాలు దూరమవుతున్నాయి. లీగల్‌గా ఈ పిటిషన్‌పై వాదనలు వినలేను. ఎందుకంటే... నేను రెండు రాష్ట్రాలకూ చెందిన వాడిని. న్యాయపరమైన విచారణే కావాలని, కేంద్ర ప్రభుత్వ జోక్యం తప్పదని భావిస్తే ఈ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తాను అని సోమవారం నాడు జరిగిన విచారణలో రమణ ఈ కీలక సూచనలు చేశారు. దీనికి ఏపీ ప్రభుత్వం సమ్మతించలేదు.