వందలాది చిన్నారులకు శ్రద్ధతో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్‌వారు చేస్తున్న సేవ నా మనసును తాకింది. గతంలో సర్‌ప్రైజ్ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా, వాళ్ల కోసం నేను సంగీతం వాయించాను. అప్పటి నుంచి వాళ్లతో కనెక్ట్ అయిపోయాను. నా పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడున్న కఠిన పరిస్థితుల్లో ఇలాంటి వారికి అండగా నిలబడాల్సిన అవసరం మనకెంతో ఉంది. ఎవరైనా డ్యాడీస్ హోం వారికి సాయం చేయాలనుకుంటే 9948661346 నెంబర్‌కు కాల్ చేసి మీ వంతు సాయాన్ని అందించండి అని తెలిపారు దేవిశ్రీప్రసాద్.