రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ఇచ్చేసింది. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా సెలవులు ఇవ్వలేదు.
జూన్ 12వ తేదీన తిరిగి బడి తలుపులు తెరుచుకోనున్నాయి. ఇందులోభాగంగా, జూన్ ఒకటో తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యాశాఖ భావిస్తుంది. అంటే, బడిఈడు పిల్లలను గుర్తించి, వారికి పాఠశాల్లో అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ పాఠశాలలు మాత్రం జూన్ 12వ తేదీనే తెరుచుకుంటాయి.