SSCResults: పదో తరగతి పరీక్షల్లో ప్రకాశం టాప్... 67.26%తో ఉత్తీర్ణత

సోమవారం, 6 జూన్ 2022 (12:56 IST)
ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ప్రకాశం జిల్లా 78.3%తో ఫలితాల్లో టాప్‌గా నిలిచింది. అనంతపురం జిల్లా 49.7 % శాతం ఫలితాల్లో చివరి స్థానంలో నిలిచింది. 
 
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రెండేళ్ల తర్వాత జరిగిన పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం www.results.bse.ap.gov.in వెబ్‌సైట్‌ లో ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. 
 
పరీక్షలకు మొత్తం 6,21,799 మంది హాజరు కాగా 414281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 67.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. వీరిలో బాలురు 64.02 శాతం, బాలికలు 70.70 శాతం పాస్‌ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30 శాతం మంది, అత్యల్పంగా అనంతపురంలో 49.70 శాతం ఉత్తీర్ణత సాధించారు.
 
శనివారం అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ప్రతీసారి విద్యార్థుల ఫలితాలను గ్రేడ్‌ల రూపంలో అందించేవారు. కానీ ఈసారి మాత్రం గ్రేడ్‌లకు బదులు మార్కులను ప్రకటించారు.


 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు