అదేసమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ ఎండ, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీనికితోడు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్రంలోని 433 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది. 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
రానున్న రెండు రోజులు కోస్తాలో వడకాల్పులు, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 11వ తేదీ వరకు కోస్తాలో ఎండలు కొనసాగుతాయని వాతావణ శాఖ తెలిపింది. అయితే, వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.