'నపుంసక' టీచర్ ఉద్యోగం ఊడుతుందా? నన్నపనేని ఏమన్నారు?

సోమవారం, 4 డిశెంబరు 2017 (14:41 IST)
తాను నపుంసకుడన్న విషయాన్ని బహిర్గతం చేసినందుకు శోభనం రాత్రి తన భార్యపై పైశాచికంగా ప్రవర్తించిన శాడిస్ట్ టీచర్ భర్తకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్రవ్యతిరేకత పెల్లుబుకుతుంది. ఆ శాడిస్ట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు మండిపడుతున్నారు. అలాంటి కిరాతక చర్యకు పాల్పడిన అతను ఉపాధ్యాయుడిగా పనికిరాడనీ, తక్షణం విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నరరూప రాక్షసుడి చేతిలో తీవ్రంగా దెబ్బలు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ వధువు శైలజను ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె శైల‌జ‌ను పరామర్శించి వివ‌రాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శైల‌జ‌ భర్త రాజేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై తాము రాష్ట్ర స‌ర్కారుకి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. శైల‌జ‌కు అండగా ఉంటామని ప్ర‌క‌టించారు.
 
కాగా, చిత్తూరు జిల్లా మోతరంగనపల్లిలో రాజేష్ అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు త‌న‌కు పెళ్లి జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే అంటే శోభనం రాత్రి తన భార్య‌ను గొడ్డును బాదిన‌ట్లు కొట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ పెళ్లికూతురు శైల‌జ‌కి తిరుపతిలోని స్విమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు