ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు 6,970

మంగళవారం, 4 జనవరి 2022 (13:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఇందుకోసం 6,970 బస్సులను సిద్ధం చేసింది. గత యేడాదితో పోల్చితే ఈ బస్సుల సంఖ్య 35 శాతం అధికం. ఈ సంక్రాంతి బస్సుల్లో పండుగకు ముందు 4,125 బస్సులు, పండగ తరవ్తా 2,825 బస్సులను నడుపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ బస్సుల్లో ప్రత్యేక ప్రయాణ చార్జీలు వసూలు చేస్తారా లేదా అన్నది తేలాల్సివుంది. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతున్న విషయం తెల్సిందే. ఈ బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణాలోని పలు కీలక ప్రాంతాలకు నడిపేలా ఆ సంస్థ ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. అలాగే, ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయకుండానే నడుపుతామని ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు