ప్రీమియం బ్రాండ్లను మందుబాబులకు అందుబాటులో తీసుకొచ్చింది. 30, 31 తేదీల్లో మొత్తంగా సుమారు 215 కోట్లు రూపాయల మద్యాన్ని దుకాణాలకు సరఫరా చేస్తే ఒక్క చుక్క లేకుండా తాగేశారనేది ఆబ్కారీ లెక్కలను బట్టి తెలుస్తోంది.
30న 90 కోట్ల మద్యం విక్రయాలు జరిగి ఉంటాయని ప్రభుత్వం లెక్క. ఎపిలో పాపులర్ ప్రీమియం బ్రాండ్లకు కొరత ఏర్పడింది. చాలా చోట్ల ప్రీమియంబ్రాండ్లు లభించక మందు బాబులు మద్యం దుకాణాల నుంచి వెనుతిరిగిన పరిస్థితి. వివిధ పాపులర్ బ్రాండ్ల కంపెనీలు డిస్టలరీలతో ఎక్సైజ్ శాఖ సంప్రదింపులు జరిపి ఆర్డర్లు పెట్టినా సదరు కంపెనీలు పెట్టిన ఆర్డర్లకు సరఫరా చేయలేకపోయారట. దీంతో వచ్చిన స్టాకు మొత్తం త్వరగా ఖాళీ అయిపోయిందట. దీంతో ఎపిలో పాపులర్ బ్రాండ్లకు కొరత ఏర్పడిందట.