విజయవాడలో ఫైబర్ ఆపరేటర్ల అరెస్టులు.. ఎందుకో తెలుసా?

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:16 IST)
కృష్ణా జిల్లాలోని ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఛలో విజయవాడకు ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

గత రాత్రి జిల్లాలోని ఫైబర్ కేబుల్ ఆపెరటర్స్‌కు నోటీసులు ఇస్తూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఫైబర్‌నెట్‌లో ఏబీఎన్‌ ప్రసారాన్ని నిలిపివేశారు.

ప్యాకేజీల మార్పు ఇతరత్రా సమస్యలపై ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఫైబర్‌నెట్‌ ఆపరేటర్ల ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భగ్నం చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో  పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి అరెస్టులు, నిర్బంధాల పర్వాన్ని చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు