ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

ఐవీఆర్

బుధవారం, 29 అక్టోబరు 2025 (20:04 IST)
హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని హైదరాబాద్‌లోని HCAH సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించింది. ఇది స్ట్రోక్, న్యూరో రిహాబిలిటేషన్‌లో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మరియు మానవ సంరక్షణను సౌకర్యవంతంగా మిళితం చేయటం ద్వారా భారతదేశంలో అత్యంత వేగవంతమైన రికవరీని అందించాలనే HCAH లక్ష్యానికి ఈ కేంద్రం ప్రాతినిధ్యం వహిస్తుంది. 
 
తెలంగాణలో స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి, పట్టణ ప్రాంతాలలోని రోగులలో దాదాపు 20-30% మంది ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వుంటున్నారు. నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, ఊబకాయం, కొవిడ్ అనంతర సమస్యలు ఈ భయంకరమైన పెరుగుదలకు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రత్యేక రీహాబిలిటేషన్ సౌకర్యాల కోసం రాష్ట్రంలో పెరుగుతున్న అవసరాలను గుర్తించి, HCAH కోలుకోవడం అంటే ఏమిటో పునర్నిర్వచిస్తోంది- దీనిని కొలవగల, డేటా-ఆధారిత మరియు రోగి-కేంద్రీకృతమైనదిగా చేస్తుంది.
 
భారతదేశంలో ప్రస్తుతం 146 కోట్ల మంది జనాభాకు కేవలం 1,251 స్ట్రోక్ రీహాబిలిటేషన్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అంటే, దాదాపు ప్రతి 1.17 మిలియన్ల మందికి ఒకటి. ఈ కొరత నిర్మాణాత్మక, సాంకేతికత ఆధారిత రికవరీ సంరక్షణ యొక్క అత్యవసర అవసరాన్ని నొక్కి చెబుతుంది. తమ రోబోటిక్స్-రికవరీ ల్యాబ్‌లతో ఈ అంతరాన్ని HCAH తగ్గిస్తోంది. తెలంగాణలో ప్రారంభించి ఢిల్లీ-NCR, బెంగళూరు, ముంబై మరియు కోల్‌కతాకు విస్తరించనుంది. రోబోటిక్ ఖచ్చితత్వం, ఏఐ-ఆధారిత థెరపీ ట్రాకింగ్, క్లినికల్ నైపుణ్యాన్ని కలపడం ద్వారా ఫలితాల ఆధారిత రీహాబిలిటేషన్ కోసం ఒక కొత్త ప్రమాణాన్ని HCAH నిర్దేశిస్తోంది.
 
హైదరాబాద్ కేంద్రంలో, భద్రత, ఖచ్చితత్వం, వేగం కోసం రూపొందించబడిన ప్రపంచ స్థాయి రోబోటిక్ వ్యవస్థల పూర్తి సూట్ ద్వారా సాంకేతికతను రికవరీ కలుస్తుంది. రోబోటిక్ గైట్ శిక్షణా వ్యవస్థలు, రోబోటిక్ ఆర్మ్ మరియు హ్యాండ్ రిహాబిలిటేషన్ యూనిట్లు, న్యూరోమస్కులర్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ (NMES), గేమిఫైడ్ బ్యాలెన్స్ బోర్డులు, వర్చువల్ రియాలిటీ (VR) న్యూరోథెరపీ రోగులు నడవడానికి, కదలడానికి, మాట్లాడటానికి, తిరిగి సమతుల్యం చేసుకోవడానికి-సాంప్రదాయ పద్ధతుల కంటే చాలా వేగంగా మెదడు, శరీరానికి తిరిగి శిక్షణ ఇచ్చే సెషన్‌కు వేల ఖచ్చితమైన పునరావృత్తులు ఒకే తరహాలో పనిచేస్తాయి. 
 
రోగులు ఇప్పుడు ఎక్సోస్కెలిటన్-సహాయక నడక వ్యవస్థలను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో 1,000 గైడెడ్ స్టెప్స్ తీసుకోవచ్చు, ఇవి సహజ నడకను అనుకరిస్తూనే పూర్తిగా మద్దతు ఇస్తాయి. ముఖ్యంగా, ప్రతిష్టాత్మక రోబోటిక్ నడక శిక్షణ గైటర్- భారతదేశంలో తయారుచేయబడిన ఆవిష్కరణ- దేశం యొక్క పెరుగుతున్న మెడ్‌టెక్ సామర్థ్యాన్ని వెల్లడి చేస్తుంది. మోచేయి మరియు చేయి కోలుకోవడానికి, రోబోటిక్-సహాయక చికిత్స ప్రతి కదలిక, ప్రయత్నాన్ని నిజ సమయంలో కొలుస్తుంది, పరిమాణాత్మక పురోగతిని నిర్ధారిస్తుంది. NMES పరికరాలు మింగడం, మాట్లాడటంలో భాగమయ్యే కండరాలను బలోపేతం చేస్తాయి, రోగులు స్వతంత్రంగా తినడం, మాట్లాడటం, శ్వాస విధులను తిరిగి పొందడంలో సహాయపడతాయి. గేమిఫైడ్ బ్యాలెన్స్ థెరపీ, విఆర్-ఆధారిత మోటర్ శిక్షణ రీహాబిలిటేషన్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి, స్థిరమైన రికవరీ కోసం న్యూరోప్లాస్టిసిటీ మరియు అభిజ్ఞా పనితీరును ప్రేరేపిస్తాయి.
 
HCAH ఇండియా సహ వ్యవస్థాపకుడు- అధ్యక్షుడు డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ, స్ట్రోక్ లేదా మేజర్ సర్జరీ తర్వాత మొదటి 90 రోజులు రోగి కోలుకునే ప్రయాణంలో అత్యంత నిర్ణయాత్మక దశగా నిలుస్తుంది. HCAH రోబోటిక్స్ అండ్ రికవరీ ల్యాబ్‌ వద్ద, మా లక్ష్యం సాధ్యమైనంత వేగంగా కోలుకునేలా చేయటం మీద మాత్రమే ఉంటుంది. ఈ పర్యావరణ వ్యవస్థలోని ప్రతి అంశం చికిత్సను వేగవంతం చేయడానికి రూపొందించబడింది. రోబోటిక్ గెయిట్ వ్యవస్థలు రోగులు చలనశీలతను త్వరగా, సురక్షితంగా పునర్నిర్మించడంలో సహాయపడతాయి, ఏఐ-ఆధారిత డాష్‌బోర్డ్‌లు ప్రతి మైలురాయిని నిజ సమయంలో తెలుపుతాయి. థెరపిస్ట్‌లు ఈ డేటాను ఉపయోగించి సెషన్‌లను శాస్త్రీయ ఖచ్చితత్వంతో స్వీకరించడానికి ఉపయోగిస్తారు. రోబోటిక్స్, అనలిటిక్స్, ప్రేమతో కూడిన చికిత్సలను విలీనం చేయడం ద్వారా, రోగులు చలనశీలత, ప్రసంగం మరియు స్వాతంత్య్రంను ఎంత త్వరగా మరియు పూర్తిగా తిరిగి పొందవచ్చనే దానిపై మేము కొత్త జాతీయ ప్రమాణాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని అన్నారు. 
 
HCAH సహ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు అంకిత్ గోయెల్ మాట్లాడుతూ, చికిత్స వలె, కోలుకోవడం కూడా శాస్త్రీయంగా ఉండాలనే మా నమ్మకాన్ని రోబోటిక్స్ & రికవరీ ల్యాబ్ ప్రతిబింబిస్తుంది. రోబోటిక్స్, ఏఐ, మా థెరపిస్ట్‌ల నైపుణ్యాన్ని మిళితం చేయటం ద్వారా, మేము కోలుకునే ప్రక్రియను కొలవతగిన, స్థిరమైన, ప్రేరణాత్మకంగా మారుస్తున్నాము. అపోలో ఆయుర్వేదంతో మా భాగస్వామ్యం మరొక కోణాన్ని దీనికి జోడిస్తుంది. శరీరం, మనస్సును కలిసి నయం చేయడమనే ప్రక్రియను తీసుకువస్తోంది. ప్రతి రోగితో మేము నడవడానికి, మాట్లాడటానికి లేదా మళ్ళీ తినడానికి సహాయం చేస్తాము, వేగంగా, మెరుగ్గా కోలుకునే దేశం అనే మా లక్ష్యంకు దగ్గరగా వెళ్తాము అని అన్నారు. 
 
సీనియర్ కన్సల్టెంట్ న్యూరో-స్పైన్ సర్జన్, నిమ్స్ స్పైన్ ఫెలో, వేన్ స్టేట్ యూనివర్సిటీ స్పైన్ అండ్ పెరిఫెరల్ నెర్వ్ ఫెలో, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, యుఎస్ఏ డాక్టర్ బి.ఎస్.వి. రాజు మాట్లాడుతూ, రోబోటిక్-సహాయక చికిత్స వైద్యులకు సెషన్‌కు వందలాది పరిపూర్ణ కదలికలకు మార్గనిర్దేశం చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది మెదడు తాను మరిచిపోయిన విధులను తిరిగి నేర్చుకోవడంలో సహాయపడుతుంది. గతంలో ఎన్నడూ సాధ్యం కాని వేగంతో న్యూరోప్లాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. విఆర్, NMES మరియు గేమిఫైడ్ బ్యాలెన్స్ సిస్టమ్‌లతో, రోగులు చలనశీలత, ప్రసంగం , సమన్వయాన్ని మరింత సహజంగా, నమ్మకంగా తిరిగి పొందుతారు. ఈ ల్యాబ్‌లో సైన్స్ సంరక్షణను కలుస్తుంది మరియు కోలుకోవడం అనేది తిరిగి కనుగొనే ప్రయాణంగా మారుతుంది అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు