మరోవైపు కృత్రిమ కొరత సృష్టిస్తూ డిమాండ్‌కు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల నుంచి మాస్క్‌లు, హ్యాండ్‌వాష్ శానిటైజర్‌లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఒక్కోసారి వీటి కోసం తిరగని మందుల దుకాణం అంటూ ఉండడం లేదు. ఒక్కోషాపునకు రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు వీటి కోసం తిరుగుతున్నారు.
కాగా, అధికారులకు అందిన సమాచారం మేరకు పట్టణంలో 40 మంది వరకు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు తెలిసింది. వారి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేగాక కరోనా కేసుతో మరింత విస్త్రతంగా సర్వే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.