ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న అసని తుఫాను

సోమవారం, 9 మే 2022 (14:56 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. దీనికి అసని అనే నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకునివుంది. అసని గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. 
 
ఈ తుఫాను ప్రభావం మంగళవారం అధికంగా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 
 
అదేసమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సముద్రం అలజడి అధికంగా ఉంటుందని అందువల్ల గురువారం వరకు మత్స్యుకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు