తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మూలవర్లకు పంచ గవ్యాధివాసం, యాగశాల కార్యక్రమాలు నిర్వహించారు. కాగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఉక్త హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నవంబరు 25వ తేదీ బుధవారం ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు హోమాలు, ఉదయం 9 నుండి 10.30 గంటల మధ్య మహా పూర్ణాహూతి, ధనుర్ లగ్నంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, పరివార దేవతలకు కుంభర్చాన, విమాన సంప్రొక్షణ జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, వైఖానస ఆగమ సలహాదారులు సుందరవరద భట్టాచార్యులు, కంకణభట్టార్ మురళి కృష్ణ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.