టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న అజారుద్ధీన్..

మంగళవారం, 1 జనవరి 2019 (10:27 IST)
భారత స్టార్ ప్లేయర్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్ధీన్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఎంపీ కుమార్తె వివాహంలో టీఆర్ఎస్ పెద్దలతో కలిసి అజారుద్ధీన్ హాజరయ్యారని.. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే దిశగా చర్చలు జరిగినట్లు సమాచారం. అంతేగాకుండా అజారుద్ధీన్‌కు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధంగా వున్నారని కూడా టీఆర్ఎస్ వర్గాల సమాచారం. 
 
ఇకపోతే, 2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అజారుద్ధీన్, అదే ఏడాది యూపీలోని మొరాదాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆపై 2014లో ఆయన పోటీ చేయలేదు. గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన నియామకం జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో అజారుద్ధీన్ తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు