మామిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. మామిడి పూతపై తామర పురుగు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల్లో ఈ తామర పురుగు వృద్ధి చెందితే ఈ ఏడాది తియ్యటి మామిడి పండ్లు లభించడం కష్టం అవుతుంది. నల్ల తామర పురుగు గత ఏడాది నవంబర్ చివరిలో మిరప పంటల నుంచి మొదలైంది. దాదాపుగా 90 శాతం పంటలకు నష్టం కలుగచేసింది.