అనంతపురం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణకు షాక్ తగిలింది. బాలకృష్ణ పిఏ శేఖర్‌కు జైలు శిక్ష విధించింది నెల్లూరు ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షలు జరిమానా విధించింది.
దాంతో నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు చోటుచేసుకోవడానికి ప్రధాన కారకుడు అయ్యారని పెద్దఎత్తున వార్తలు వినిపించాయి. ఆరోపణలు తీవ్రం కావడంతో బాలకృష్ణ శేఖర్‌ను తప్పించారు. ఇకపోతే శేఖర్‌పై 2008లో కేసు నమోదు కాగా, మూడు రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టు శిక్ష ఖరారు చేసింది.