నర్సు సోదరీమణులంటే నాకెంతో గౌరవం : హీరో బాలకృష్ణ

సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (16:48 IST)
తాను నర్సులను కించపరిచేలా, అవమానించేలా మాట్లాడినట్టు మీడియాలో వస్తున్న వార్తలపై హీరో బాలకృష్ణ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ ఆగ్రహించారు. నర్సు సోదరీమణులంటే తనకెంతో గౌరవమని ఆయన చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడివుంటే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానంటూ వివరణ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవుళ్లు రోగులకు సపర్యలను చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవమన్నారు. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని అన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో నిద్రహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలు అందించారని చెప్పారు. అంటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను" అంటూ వివరణ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు