హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజీవ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న పోలీసులు.. రాజీవ్‌తో పాటు శ్రవణ్‌ల వద్ద విచారణ జరిపారు. పనిలోపనిగా రాజీవ్ ప్రియురాలు తేజస్విని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.
అయితే, పోలీసులకు రాజీవ్ ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇందులో తేజస్విని పెళ్లి చేసుకునే ఉద్దేం తనకు లేదని, శిరీషతో ఏ విధంగా ఉన్నానో... అదేవిధంగా తేజస్విని కూడా వాడుకుని వదిలేయాని భావించినట్టు తెలిపారు. పైగా, ఇంట్లోవారు చూసే అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడిపోవాలని, దీనికంటే ముందుగా శిరీషను, తేజస్విని వదిలించుకోవాలన్న గట్టి నిర్ణయంతో ఉన్నట్టు చెప్పారు.
ఇందులోభాగంగా, మొదట శిరీషను వదిలించుకోవాలనే కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లామని చెప్పారు. అయితే శిరీషను చంపాలనే ఉద్దేశం తనకు లేదని, జరిగిన పరిణామాలు తెలుసుకుని శిరీష ఆత్మేహత్య చేసుకుందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. నేరుగా ఇంటికి వచ్చిన తేజస్విని తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదని రాజీవ్ చెప్పాడు. తర్వాత శిరీషతో తేజస్విని గొడవపడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవతో నలిగిపోయి ఈ క్రమంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి చెప్పి శిరీషను బెదిరించాలని అనుకున్నట్లు రాజీవ్ వివరించాడు.