ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్, ఏఐ-ఎన్‌హాన్స్‌డ్ స్టోరీటెల్లింగ్, గొప్ప స్క్రీన్‌ప్లే తో సిమిమా విజువల్ గ్రాండియర్ గా వుండబోతుంది. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో మ్యూజిక్ లో రూపొందుతోంది. సినిమా ఏడాదిలోనే పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది.
జీ స్టూడియోస్ ఇప్పటికే ఎన్నో విభిన్న కథలతో ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్టు ను జీ స్టూడియోస్ సీబీవో ఉమేష్ కుమార్ బన్స్‌ల్ ఆయన విజన్, స్పెషల్ కాన్సెప్ట్‌ల మీద ఆసక్తి, ఈ సినిమాని ప్రత్యేకంగా నిలిపేలా చేస్తోంది.
ప్రెర్నా అరోరాకి ఇది జీ స్టూడియోస్‌తో రెండవ భారీ ప్రాజెక్ట్. ఇంతకుముందు "రుస్తమ్"తో పని చేశారు. "టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథ", "ప్యాడ్‌మ్యాన్", "పరి", "బట్టి గుల్ మీటర్ చాలు" వంటి అవార్డు విన్నింగ్ సినిమాలను కూడా నిర్మించారు.
జటాధర సినిమాను ఉమేష్ కుమార్ బన్స్‌ల, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా కలిసి నిర్మిస్తున్నారు. సహ నిర్మాతలుగా అక్షయ్ కేజ్రీవాల్, కుసుమ్ అరోరా ఉండగా, దివ్య విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్.