భీమవరంలో భారీ కుంభకోణం.. రూ.370 కోట్ల రుణం తీసుకుని?

సోమవారం, 19 ఆగస్టు 2019 (19:35 IST)
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో ప్రైవేటు బ్యాంకులకు కొందరు వ్యక్తులు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. దాదాపు రూ.370 కోట్లు రుణం పొంది.. వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఈ వ్యవహారంలో భీమవరానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బ్యాంకు అధికారుల సమాచారంతో  ఆయా బ్యాంకుల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. భీమవరంతోపాటు జిల్లా వ్యాప్తంగా రుణాలు తీసుకున్న వారి రికార్డులను కూడా గత రెండు రోజులుగా పరిశీలిస్తున్నారు. 
 
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఆక్వారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురికి బ్యాంకులు రుణాలిస్తుంటాయి. ఇదే అదునుగా కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలను సమర్పించి రుణాలు పొంది బ్యాంకులను మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు