ఎమ్మెల్యేలకు జగన్ బంపర్ ఆఫర్.. ఎమ్మెల్యేలే మార్కెట్ కమిటీ గౌరవ చైర్మన్లు

సోమవారం, 8 జులై 2019 (18:49 IST)
మార్కెట్ కమిటీలకు గౌరవ చైర్మెన్లుగా ఎమ్మెల్యేలు ఉంటారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. గోదావరి నీటిని తెచ్చి కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
 
సోమవారం నాడు జమ్మలమడుగు నియోజకవర్గంలో రైతు దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీ ఛైర్మెన్లు ఎగ్జిక్యూటివ్ చైర్మెన్లుగా కొనసాగుతారని ఆయన తెలిపారు.
 
తమ నియోజకవర్గంలో పండిన పంటకు ఎమ్మెల్యేలు గిట్టుబాటు ధర లేని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని చెప్పారు. ఈ విషయమై ఎమ్మెల్యేల వినతి మేరకు ధరల స్థిరీకరణ నిధిని ఆయా నియోజకవర్గాల్లో ఈ నిధి ద్వారా రైతులను ఆదుకొంటామని ఆయన ప్రకటించారు.

గోదావరి నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు అందిస్తామన్నారు. గోదావరి నీటిని శ్రీశైలం ద్వారా నీటిని అందించి కృష్ణా ఆయకట్టును స్థిరీకరించనున్నట్టుగా ఆయన తెలిపారు. గోదావరి నది నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి మళ్లించేందుకు కేసీఆర్ కూడ ఒప్పుకొన్నారని ఆయన గుర్తు చేశారు. రైతుల బాధలు తనకు తెలుసునని ఆయన చెప్పారు. రైతుల కష్టాలను తీర్చేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
 
నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామన్నారు. నాణ్యమైన విత్తనాలు అని సర్టిఫై చేసిన తర్వాతే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు