టచ్ చేసి చూడండి అంటున్న భూమా అఖిలప్రియ.. ఆ స్కెచ్‌తో ఎ.వి.సుబ్బారెడ్డి..?

శుక్రవారం, 17 జులై 2020 (20:30 IST)
కర్నూలు జిల్లాలో ఎ.వి.సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ కుటుంబం మధ్య జరుగుతున్న తగాదా అంతా ఇంతా కాదు. ఇద్దరూ టిడిపిలోనే ఉన్నా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వారి కుటుంబంలో ఉంది. ఏకంగా ఎ.వి.సుబ్బా రెడ్డి హత్యకు ప్లాన్ కూడా భూమా అఖిలప్రియ చేసిందంటూ ఎస్పీని కలిసింది ఎవి సుబ్బారెడ్డి కుటుంబం.
 
ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి భూమా అఖిలప్రియతో పాటు హత్యకు ప్లాన్ చేసింది మరో ఆరుమంది ఉన్నారని వారందరినీ వెంటనే అరెస్టు చేయాలంటున్నారు. ఇందులో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ కూడా ఉన్నాడంటున్నారు ఎవి సుబ్బారెడ్డి. తన కుమార్తె జశ్వంతిని వెంటపెట్టుకుని వచ్చిన సుబ్బారెడ్డి తనకు న్యాయం చేయాలంటున్నాడు.
 
అయితే సొంత పార్టీ నేతల మధ్యే ఈ గొడవ జరుగుతుండటం ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. అయితే తననూ ఎవరూ టచ్ చేయలేరంటోంది అఖిలప్రియ. నన్ను గానీ, నా కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా అంటూ తన అనుచరులతో బహిరంగానే చెబుతున్నారు భూమా అఖిలప్రియ. మొత్తం మీద కర్నూలులో వీరి మధ్య జరుగుతున్న రచ్చ కాస్త రాజకీయ వేడిని పుట్టిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు