పవన్ సార్ ను ఉదయం 5 గంటలకు రావాలని అడిగాము. కానీ అతను ముందుగానే వచ్చి సూర్యుడు ఉదయించే వరకు వేచి ఉండి ఓజీ కోసం బాంబేలోకి అడుగుపెట్టిన తలక్రిందుల షాట్‌ను తీసుకున్నాడు.. అది అతనికి కూడా చాలా నచ్చింది. ఇక ఈ సినిమాలో ఉన్న ఎన్నో హైలైట్స్ లో పవన్ కళ్యాణ్ ని తాను కెమెరా వర్క్ తో చూపించిన విధానం థియేటర్లులో బ్లాస్ట్ గా ఆకట్టుకుంటుంది.
రవి కె చంద్రన్ పవన్ పై చేసిన ప్రశంస వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ పుట్టడమే స్టైల్ తో పుట్టాడని తన నలభై ఏళ్ల కెరీర్ లో పవన్ లాంటి స్టైల్, ఆరా ఉన్న నటుణ్ని తాను చూడలేదని తెలిపారు. హృతిక్, అమీర్ ఖాన్ ఇంకా ఎంతోమంది స్టార్స్ తో కలిసి వర్క్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి స్టైల్, ఆరా కెమెరా ముందు కానీ ఆఫ్ లైన్ లో అయినా తాను సింపుల్ డ్రెస్ వేసినా ఎట్రాక్ట్ గా వుంటారు. అది ఆయనలో వున్న ఆరా ప్రత్యేకతకు నిదర్శనం అన్నారు.